Breaking News

కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలి: సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కొత్త జీజీహెచ్ లో కొత్తగా నిర్మిస్తున్న క్యాజువాలిటీ వార్డు నిర్మాణ పనులను, క్యాజువాలిటీ , ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, వైద్యాధికారుల గదులను సోమవారం అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. కొత్త క్యాజువాలిటీ వార్డు నిర్మాణ పనులను వారంలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. , ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు, ఆధునిక వైద్య పరికరాలు, ఔషదాలు కొరత లేకుండా చర్యలు తీసుకోవడం, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అంతేకాక విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో యూరాలజి విభాగం, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు , న్యూరాలజి, తదితర విభాగాల ద్వారా సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఇటీవల హృద్రోగ శస్త్ర చికిత్సలు కూడా ఆసుపత్రి వైద్యులు దిగ్విజయంగా నిర్వహించారన్నారు. దీని కారణంగా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారని, దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోజూ రోగులతో రద్దీ గా ఉంటున్నాయన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆసుపత్రులలో వార్డులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలనీ వైద్యాధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. పాత, కొత్త జీజీహెచ్ లలో అందుబాటులో ఉన్న ఔషదాలు, సర్జికల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
సబ్ కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ వై. కిరణ్ కుమార్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *