Breaking News

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. స్థానిక పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో నిర్మాణం జరుపుకుంటున్న డా.బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం పనులను సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, ఆశాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, ఇతర అధికారులతో కలిసి నమూనా స్టాట్యూను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ నిధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో పెట్టామని అన్నారు. 2023 ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదినం నాటికి పెడస్త్రియల్ పూర్తిచేసి విగ్రహాన్ని ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.20 ఎకరాల విస్తీర్ణంలో 268 కోట్ల రూపాయల బడ్జెట్ తో 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం నిర్మాణ ప్రాజెక్టులో చక్కటి ల్యాండ్ స్కేప్ ,వాకింగ్ ట్రాక్ ఉంటాయన్నారు. నిర్ణీత కాల పరిమితి లోగా పనులు పూర్తి చేసి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ గుత్తేదారులను ఆదేశించారు. పనుల పరిశీలనలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి ఉన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *