గన్నవరం గడ్డ వంశీమోహన్ అడ్డ…గన్నవరం నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామవరప్పాడులోని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ నిర్వాహ‌కులు ఎస్.నూరుద్దీన్‌ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.నూరుద్దీన్‌ మాట్లాడుతూ వల్లభనేని వంశీ పై వైసిపి కి సంబంధించిన కొంత మంది కోవర్టులు ఫిర్యాదు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న వల్లభనేని వంశీ పై ఫిర్యాదు తగునా అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీ కి రోజు రోజుకూ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేసినా, గన్నవరం నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో స్వయంగా పర్యటించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత వల్లభనేని వంశీ కే దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న చరిత్ర వల్లభనేని వంశీ దీ అని అన్నారు. యార్లగడ్డ, దుట్ట వర్గాలు గన్నవరం నియోజకవర్గంలో కేవలం అశాంతిని పెంపొందించడానికి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారన్నారు. కొంతమంది వైసిపి నాయకులు టిడిపి నాయకులతో కలిసి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునే వంశీ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ 50 వేల మెజారిటీతో గన్నవరం నియోజకవర్గ ప్రజలు గెలిపించుకుంటారన్నారు. రామవరప్పాడు పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది గల్లీ నాయకులు పార్టీ ప్రతిష్టను దిగజార్చేదుకు వల్లభనేని వంశీ పై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు వారు వాటిని మానుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి సమస్య పరిష్కారం దిశగా కృషి చేసే ప్రజా నాయకుడు వల్లభనేని వంశీ అని అన్నారు. గన్నవరం గడ్డ వంశీమోహన్ అడ్డ..గన్నవరం నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అని సయ్యద్ నురుద్దిన్ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌ సభ్యులు, నిర్వాహ‌కులు, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *