Breaking News

నిత్యం నగరాన్ని పరిశుబ్రముగా ఉంచుటకు అన్ని చర్యలు తీసుకోనవలసిందిగా ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమీషనర్ ఛాంబర్ నందు కమీషనర్  పి రంజిత్ భాషా I.A.S మంగళవారం Swachh survekshan -2022 గురించి నగర పాలక సంస్థ ప్రజా ఆరోగ్య శాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఫ్ హెల్త్ డాక్టర్ జి గీత భాయి , చీఫ్ ఇంజనీర్ యం ప్రభాకర్ రావు, సిటీ ప్లానర్ ప్రసాద్, A.D.H శ్రీనివాసులు తో ఉత్తమ ర్యాంకు సాధించుటకు తీసుకొనవలసిన ప్రణాళికను తయారు చేసి ఫీల్డ్ నందు సిధంగా ఉండవలసినదిగా ఆదేశములు జారీ చేశారు. ఇందు ఇంజనీరింగ్ శాఖ వారు ప్రదానంగా  నగరం నందు ఉన్న 50 పబ్లిక్ టాయిలెట్స్ ,15 కమ్యూనిటీ టాయిలెట్స్ మొత్తం 65 టాయిలెట్స్ లో 18 మోడల్ టాయిలెట్స్ గా అభివృద్ధి చేసి ఉన్నారు.అలాగే 14 స్టాండ్ ఎలోన్ యురినల్స్ ఉన్నవి.ప్రజల సౌకర్యార్ధం అన్ని సదుపాయాలు కల్పించ వలసినదిగా ఇంజనీరింగ్ శాఖా వారికి ఆదేశాలు ఇచ్చినారు. అలాగే నగరం లో ఎక్కడ కూడా pot holes లేకుండా మరమత్తులు చేయవలసినదిగా ఆదేశాలు ఇచ్చారు. నగరం లోని  ONSITE COMPOST  ప్లాంట్ ల వద్ద తడి చెత్త ను ఎరువులుగా తయారు చేయటకు తగు చర్యలు,ట్విన్ బీన్స్ మరమ్మతులు చేయించ వలసినదిగా సూచనలు ఇచ్చారు.ప్రజలకు అవగాహనా నిమ్మితం SS-2022 IEC మెసేజెస్ తో వాల్ రైటింగ్ చేయవలసినధిగాను.నగరంలో యుజిడి మ్యాన్ హోల్స్ పొంగకుండా  తగు జాగ్రత్తలు తీసుకోన వలసినదిగా ఆదేశించారు. ADH శాఖ వారు నగరం లో ఉన్న 18 మోడల్ టాయిలెట్స్ వద్ద ఫ్లవర్ పాట్స్ ను ఏర్పాటు చేయవలసినదిగా తెలిపారు. TOWN PLANING శాఖ వారితో నగరం నందు ముఖ్యమైన కేంద్రముల వద్ద SS-2022 హోర్డింగ్స్ లను ఏర్పాటుచేయవలసినదిగాను అలాగే C&D ప్లాంట్ పూర్తి స్తాయీ లో వినుయోగంలోకి తీసుకొను రావలసినదిగా ఆదేశాలు ఇచ్చారు. ప్రజారోగ్య శాఖ వారు నిత్యం నగరాన్ని పరిశుబ్రముగా ఉంచుటకు అన్ని చర్యలు తీసుకోనవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. నగరాన్ని బహిరంగ మలముత్ర విసర్జన రహిత నగరంగానూ ,ప్లాస్టిక్ బ్యాన్ ను పూర్తి స్తాయీ లో అమలు చేయవలసినదిగాను RESIDENTIAL AREAS, COMMERCIAL AREAS తీసుకొనవలసిన చర్యలు,సిటిజెన్ ఫీడ్ బ్యాక్ పురోగతి గురించి  వివరించారు.గత సంవత్సరం విజయవాడ నగరానికి జాతీయ స్తాయీ లో 3 వ ర్యాంక్ వచ్చినది అనియు  ఈ సంవత్సరం ప్రధమా ర్యాంక్ వచ్చుటకు అందరు చిత్త శుద్ధితో పని చేయవలసినదిగాను ఆదేశాలు ఇచ్చారు.సదరు సమావేశము నకు ప్రజారోగ్య శాఖ అధికారులు సర్కిల్ ఇంజనీర్స్ ,శానిటరీ సూపర్  వైజర్స్, GEO స్టాట్ కన్సల్టెంట్ – సునంద ,విరించి  మొదలగు వారు పాల్గొన్నారు .

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *