భగవంతుడు అల్లాహ్ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండబట్టే మక్కాకు వెళుతున్నారు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్రా చేయుటకు మక్కా కు బయలు దేరుతున్న యాత్రికులను మంగళవారం తార పేట మస్జీద్ వద్ద కలుసుకొని చిరు సత్కారం చేసిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఫతావుళ్ల. హజ్ యాత్రకు బయల్దేరిన 53 మంది ముస్లిం సోదర సోదరీమణులకు శాలువా కప్పి ,పూల దండలు వేసి, స్వీట్ ప్యాకెట్లు అందజేసి సత్కరించారు. యాత్ర బాగా జరగాలని భగవంతుడు అల్లాహ్ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండబట్టే మక్కాకు వెళుతున్నారని రాష్ట్రం కోసం దేశం కోసం ప్రార్థించాలని, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మా కోసం కూడా ప్రార్థించాలని మహేష్, మక్కా కు బయలుదేరిన యాత్రికులను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మహేష్ మాట్లాడుతూ సొంత డబ్బులతో హజ్ యాత్రకు బయల్దేరిన ముస్లిం సోదర సోదరిమణులకు ఏమాత్రం సహాయం చేయకపోగా ప్రచార ఆర్భాటం కోసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇది రాజకీయంగా ప్రచారం చేస్తున్నారని ఆయనకు హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సు ముందర నుంచుని జెండా ఊపి అర్హత లేదని ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో హజ్ హౌస్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో ఒక్క ఇటుక కూడా వేయలేక పోయారని, ముసాఫిర్ ఖానా నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, ఉర్దూ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయలేక పోయారని, ముస్లిం మైనార్టీల కోసం ఏ పని చేయకుండా ప్రచారం కోసం ఇటువంటి పనులు చేస్తే ముస్లిం సోదర సోదరీమణులు మంత్రి శ్రీను కి తప్పక తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు ఫతావుళ్ళ మాట్లాడుతూ హజ్ హౌస్ నిర్మాణం కోసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కనీసం ఆలోచన చేయలేదని, వక్ఫ్బోర్డు స్థలాలు కబ్జా గురవుతున్న నియంత్రించలేక పోయారని, ఉర్దూ పాఠశాల నిర్మాణాన్ని తదుపరి ఉమ్ర కు బయలుదేరే బస్సు వెళ్లే సమయంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షైక్ .షర్మిల, షైక్.మోబినా, నూర్, సయ్యద్ అబ్దుల్ నజీబ్, సలీం, రాజా నాయుడు, రెడ్డిపల్లీ.గంగ, సింగినంశెట్టి.రాము, మైలవరపు.కొండలరావు, పొట్నూరి.శ్రీను,గన్ను.శంకర్, తమ్మిన. లీలా కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *