Breaking News

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటి ఆత్మీయ అభినందన సభ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మైనారిటీలను ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పధకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజాద్ బాషా అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటి ఆత్మీయ అభినందన సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీల కోసం సబ్ ప్లాన్ ను రూపొందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అన్నారు. మైనార్టీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు. డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ల వరకూ పదవులిచ్చిన గొప్ప నేత జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ మైనార్టీలకు ఇంతటి గుర్తింపు లభించలేదన్నారు. ఉర్ధూని సెకండ్ లాంగ్వేజ్ గా గుర్తించినందుకు ముఖ్యమంత్రికి ముస్లిం ప్రజలందరి తరుపున కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ముస్లింలను మోసం చేసింది అని, ఈ ప్రభుత్వం ముస్లిం ల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. విజయవాడలో హజ్ యాత్రికుల కోసం ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ గౌసల్ అజాం మాట్లాడుతూ రాబోయే రెండు నెలల్లో హజ్ యాత్రలు ప్రారంభం కానున్నాయన్నారు. హజ్ యాత్ర ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేశామన్నారు. హజ్ హౌస్ ఏర్పాటు అంశం పై సీఎంను కలుస్తామని గౌసల్ అజాం అన్నారు.
సినీనటుడు ఆలీ మాట్లాడుతూ ఏపీలో ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్ అన్ని రకాలుగా గుర్తింపునిస్తున్నారన్నారు. అన్నారు. హజ్ యాత్రికులకు సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. నాంపల్లిలో హజ్ యాత్రికులకు హజ్ హౌస్ ఉందని అదే తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ ప్రభుత్వం హజ్ హౌస్ నిర్మిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
ఈ సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్ ఆసిఫ్,విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, వైసీపీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ తదితరులుకర్నూలు, మదనపల్లె శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మరియు నవాజ్ బాషా, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఆసిఫ్ ,వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్,శాసనమండలి సభ్యులు ఇసాక్ బాషా,మహమ్మద్ రూహుల్లా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాతూన్,మినరల్ డవలెప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ షమీమ్ అస్లాం, కర్నాటక రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు రఫీయుద్దీన్ కఛోరీవాలా,ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *