సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా ఏర్పాటు కానున్న ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు కలెక్టర్‌ కార్యాలయం, అనుబంధం వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌, మీనీమీటింగ్‌ హాల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం, జాయింట్‌ కలెక్టర్ల కార్యాలయాల నిర్మాణాలకు జరుగుతున్న పనులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీలించారు. ప్రస్తుతం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ భవనాలలో అందుబాటులో ఉన్న వివిధ గదులలో నూతన కలెక్టర్‌ కార్యాలయానికి అనువుగా మార్పులు చేసేందుకు చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి కార్యాలయాలను సిద్దం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు జరుగుతున్న కలెక్టర్‌ కార్యాలయానికి సమీపంలోని జాయింట్‌ కలెక్టర్లు, డిఆర్‌వో కార్యాలయ ఛాంబర్లు, అనుబంధ సెక్షన్లు, వేచి ఉండే గదులు (వెయిటింగ్‌ హాల్స్‌), క్యాంప్‌ క్లర్కులు (సిసిలు) గదుల నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యాలయానికి వెనుక భాగంలో ఉన్న పాత రెవెన్యూ గేస్ట్‌ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న డివిజనల్‌ సర్వే ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం, ఫ్రీ లిటగేషన్‌ సెల్‌, ఖాళీగా ఉన్న ఇతర గదులలో జరుగుతున్న పనులను కలెక్టర్‌ పరిశీలించి త్వరితగతిన కార్యాలయాలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *