విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యవసర వస్తువులు, వంట నూనెలను అనధికార నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. నందిగామ, ఏ.కొండూరు, తిరువూరు,విజయవాడ నగరంలోని పలు దుకాణాల్లో మంగళవారం పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టి.కనకరాజు ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని దుకాణాల నిర్వాహకులను ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో అనధికారికంగా స్టాక్ నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మితే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పాత ఎమ్మార్పీ ధరలకు అమ్మకుండా స్టాక్ నిల్వ చేయటం, ప్రముఖ బ్రాండ్ ఆయిల్ ఉత్పత్తులను స్థానికంగా డూప్లికేటే తయారు చేసి విక్యాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దీనిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా వంట నూనెలను అక్రమంగా నిల్వచేసినా, అధిక ధరలకు అమ్మినా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధిత దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు అన్నారు.
నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు.
Tags vijayawada
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …