Breaking News

50లక్షల రూపాయల నిధులతో క్రిస్టియన్ శ్మశానవాటిక ప్రారంభం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో 14 పేటల క్రిస్టియన్ లకు ఉపయోగపడేలా 50లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో క్రైస్తవ స్మశానవాటిక ను నిర్మించడం జరిగిందని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వర నగర్ నందు జరిగిన క్రైస్తవ శ్మశాన వాటికను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ రెడ్డి లతో కలిసి అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ క్రైస్తవ స్మశానవాటిక నగర క్రిస్టియన్ ల 20 ఏళ్ల కల అని,స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో స్థలం కేటాయించిన సరే తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్మాణానికి నోచుకోలేదు అని,ఎన్నిసార్లు ధర్నాలు చేసిన,అర్జీలు పెట్టుకొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పట్టిఎంచుకోలేదు అని,మొన్న జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు బెల్లం దుర్గ ప్రత్యేక చొరవ తీసుకొని కమిషనర్, మేయర్ లతో మాట్లాడి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేపించారని,దగ్గరుండి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా నిర్మాణం పూర్తి అయ్యేలా కృషి చేశారని అభినందించారు.తూర్పు నియోజకవర్గంలో రూ.350 కోట్లలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు. గద్దె రామ్మోహన్ అసెంబ్లీలో చిల్లారతనంగా ప్రరావర్తిస్తూ నగరవాసుల పరువు తీస్తున్నారని,ఇదేనా ఆయన అనుభవం అని ఎద్దేవా చేశారు. రాజకీయాలలో హుందాతనం గా వ్యవహరించాలని ఇలా షో రాజకీయాలు చేసి దిగజరిపోవడం తగదని హితవుపలికారు. ఇకనైనా టీడీపీ నాయకులు షో రాజకీయాలు మానుకొని అసెంబ్లీ ని అవమానించినందుకు స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని అన్నారు.ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడుపుతున్న ఘనత వైస్సార్సీపీ ప్రభుత్వం దే అని,నగర అభివృద్ధి కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని హామీ అవినాష్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు,కార్పొరేటర్లు కలాపాల అంబేద్కర్,మెరకనపల్లి మాధురి,క్రిస్టియన్ నాయకులు తోకల శ్యామ్,డేవిడ్ రాజు,క్లైవ్,జగ్గా,కుటుంబరావు,రాజ్ కమల్,తుళ్లూరు ఉదయ్ మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *