పేదలందరికీ సొంత గూడు ఉండాలనేదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా క్రమబద్ధీకరణ చేసిన ఇంటి స్థల పత్రాల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేదలందరికీ సర్వ హక్కులతో కూడిన ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఉండాలనేదే సీఎం వైఎస్ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో పలువురు గిరిపురం వాసులకు జీవో నెం.463 ద్వారా క్రమబద్దీకరణ చేసిన ఇంటి స్థల పత్రాలను బుధవారం ఆయన అందజేశారు. ఎంతోకాలంగా పేద ప్రజలు నివసిస్తున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా వారి జీవితాలలో సీఎం జగనన్న వెలుగులు నింపారన్నారు. కొన్ని దశాబ్ధాలుగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ఈ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. జీవో నెం. 463 ద్వారా ఈ స్థలాలపై అమ్మకము మరియు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు, వంశపారంపర్యంగా అనుభవించవచ్చన్నారు. ఈ ఇంటి స్థలాలను ఏ బ్యాంకులోనైనా ఎప్పుడైనా తనఖా పెట్టుకోవచ్చని వెల్లడించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పేదలను ఇళ్ల పేరిట నిలువునా దోచుకుంటే.. ఈ ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కుక్కల అనిత, నార్త్ తహసీల్దార్ దుర్గా ప్రసాద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *