Breaking News

హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు – కమిషనర్ పి.రంజిత్ భాషా

-వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ యొక్క నిర్వహణ విధానమును మరియు నగర పరిధిలోని వివిధ రిజర్వాయర్లకు రక్షిత నీటి సరఫర విధానముపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వేసవిలో నాచు శాతం అధికంగా ఉత్పత్తి ఆగుటకు అవకాశం ఉన్నందున రా వాటర్ ను శుద్ధి చేయు సమయంలో కాపర్ సేల్ఫడ్, యాక్టివేటేడ్ కార్బన్, ఆలమ్ మరియు క్లోరిన్ గ్యాస్ తగిన మోతాదులో ఉండేలా చూచి ప్రజలకు అందించు నీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *