-విద్యార్ధులచే ప్రజలకు అవగహన ర్యాలి
-నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి.గీతాభాయి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
స్వచ్చ్ భారత్ లో విజయవాడ నగరం మెరుగైన ర్యాంక్ సాదించాలానే లక్ష్యంగా చేపట్టిన చర్యలలో భాగంగా బుధవారం 62 వ శానిటరీ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఎల్.బి.ఎస్ నగర్, పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నత పాఠశాల 200 మంది విద్యార్ధులు మరియు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన మెగా స్వచ్చ్ భారత్ ర్యాలి ని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి.గీతాభాయి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో మన నగరం ఉత్తమ ర్యాంక్ సాదించుట చర్యలు తీసుకోవాలనే కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఎ.ఎస్ గారి సూచనలకు అనుగుణంగా శానిటరీ డివిజన్లలో ప్రజలకు పరిసరాలు పరిశుభ్రత, తడి పొడి చెత్త వేరు చేసి అందించుట, సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మొదలగు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మెగా ర్యాలి లను నిర్వహించుట జరుగుతుందని అన్నారు. ప్రజలు కూడా నగరపాలక సంస్థ వారితో సహకరించి మొదటి ర్యాంక్ కైవసం చేసుకొనే దిశగా సహకరించాలని పిలుపునిచ్చారు. ర్యాలి నందు విద్యార్ధులు బ్యానర్లు మరియు ప్లే కార్డు లను పట్టుకొని, స్వచ్చ్ భారత్ లో మన విజయవాడ నగరపాలక సంస్థ పాల్గొంటుందని నినాదాలు చేయుచూ ఎల్.బి.ఎస్ నగర్ మెయిన్ రోడ్, లక్ష్మి నగర్, ఆంధ్ర బ్యాంక్ ఏరియా, నూజివీడు ప్రధాన రహదారి, ఫైర్ స్టేషన్ రోడ్, పాకిస్తాన్ కాలనీ, రాజీవ్ నగర్ మెయిన్ రోడ్, ప్రకాష్ నగర్ సెంటర్, హసన్న మందరం రోడ్ నుండి ఎల్.బి.ఎస్ కాలనీ వరకు ర్యాలి నిర్వహించారు.
ఈ మెగా ర్యాలి నందు హెల్త్ ఆఫీసర్ డా.రామ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్ వైజర్ కె.ఆర్.ఎన్ కిషోర్, ఆర్.ఒబేశ్వరరావు, యం.రమేష్, శానిటరీ ఇన్స్ పెక్టర్ బి.కృష్ణా రావు, మరియు శానిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.