వెహికల్ డిపో ఆకస్మిక తనిఖి – మేయర్ రాయన భాగ్యలక్ష్మి

-పారిశుధ్య నిర్వహణకు ఎటువంటి అవరోధం కలుగకుండా చర్యలు చేపట్టాలి
-పారిశుధ్య వాహనముల మరియు శానిటరీ స్టోర్ రూమ్ నిర్వహణ తీరు పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయరు శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలసి బుధవారం వెహికల్ డిపో ను ఆకస్మిక తనిఖీ చేసి పారిశుధ్య నిర్వహణకు అందుబాటులో ఉన్న వాహనములు, వాటి యొక్క కండిషన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. ముందుగా వెహికల్ డిపో నందలి శానిటేషన్ స్టోర్ రూమ్ ను సందర్శించి పారిశుధ్య నిర్వహణకు సంబంధించి అక్కడ అందుబాటులో ఉన్న పరికరాలు, వాటిని ఏవిధంగా డివిజన్లకు సరఫరా చేస్తున్నది, స్టోర్స్ నందు అందుబాటులో గల స్టాక్ రికార్డు ప్రకారముగా ఉన్నదా లేదా అని పరిశీలించారు. అదే విధంగా వెహికల్ నందు విధులు నిర్వహించు సిబ్బంది యొక్క వివరాలు మరియు వాహనము యొక్క స్దితిగతులను అధికారులను అడిగితెలుసుకొని డిపో నందలి పాత పనికిరాని టైర్స్ మరియు స్క్రాప్ మొత్తం ఆక్షన్ వేయడానికి తగు చర్యలు తీసుకోవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

అదే విధంగా అందుబాటులో లేని పాత వాహనములకు తగిన మరమత్తులు చేయించి, వాటిని వినియోగములోనికి తిసుకురావలసినదిగాను, వినియోగకరంగా లేని పనికిరాని వాహనములు ఆక్షన్ వేయుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. డిపో ఆవరణలో గల వ్యర్ధములు, మట్టిని మరియు చెత్తను వెంటనే తొలగించి పరిశుభ్రంగా ఉంచమని సంబధిత అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి చెత్త సేకరణకు వినియోగించు వాహనములను డివిజన్ లకు కేటాయించు విషయంలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వాహనముల యొక్క కండిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఏపాటి చిన్న రిపేర్ వచ్చునను వెంటనే వాటికీ మరమ్మత్తులు చేపట్టాలని, ప్రతి ఒక్కరు సమయ పాలనా పాటిస్తూ, వారికీ కేటాయించిన విధులను భాద్యతగా నిర్వహించేలా చూడాలని అన్నారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.కోటేశ్వరరావు, స్టోర్స్ ఇన్ ఛార్జ్ యోగేంద్ర మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *