Breaking News

డివిజన్ పరిధిలో చిన్న చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజక వర్గ పరిధిలోని 17వ డివిజన్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మరియు అధికారులతో కలసి డివిజన్ పరిధిలోని చలసాని నగర్ సాంపిల్ బిల్డింగ్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా మాన్ హోల్స్ ను మరియు పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించి, నివాసాల నుండి చెత్తను సేకరించు సిబ్బంది యొక్క పనితీరును, సైడ్ డ్రైన్స్ మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ తీరును పరిశీలించిన సందర్భంలో పలు చోట్ల యు.జీ.డి మ్యాన్ హోల్స్ మూతలు సక్రమముగా లేకపోవుట గమనించి తక్షణమే వాటిని సరిచేయాలని సంబందిత అధికారులకు సూచించారు. అదే విధంగా డివిజన్లో పారిశుధ్య నిర్వహణ విధానము కూడా సక్రమముగా నిర్వహించేలా చూడాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు.

45వ డివిజన్ నందలి ఉర్దూ మహిళా జూనియర్ కళాశాలలో వసతుల పరిశీలన
నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, యం.యల్.సి. మొహమ్మద్ రుహుల్లా మరియు స్థానిక కార్పొరేటర్ తో కలసి 45వ డివిజన్ పరిధిలో గవర్నమెంట్ ఉర్దూ మహిళా జూనియర్ కళాశాల నందలి అభివృద్ది పనులు మరియు భవన నిర్మాణమును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్దులకు అన్ని మౌళిక సదుపాయములు అందుతున్నాయా లేదా అని ఉపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు.

పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి మైలవరపు మధురి లావణ్య, 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అకీబ్ అర్షద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *