ఇండ్ల నిర్మాణా లను వేగవంతం చెయ్యాలి…ప్రభుత్వం కలుగచేస్తున్న ప్రయోజనాలు వివరించాలి… 

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఇండ్ల నిర్మాణా లను వేగవంతం చేయాలని ప్రభుత్వం కలుగచేస్తున్న ప్రయోజనాలు వివరించాలని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి /జెడి(ఎస్ డబ్ల్యూ) ఎస్. మధుసూదన్ రావు పేర్కొన్నారు.

బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సి ఉందన్నారు. ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా ఇప్పటికే ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్దిదారులచే అవగాహన పెంచాల్సి ఉందన్నారు. ఓటీఎస్ లబ్దిదారులచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఓటీఎస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పై దృష్టి పెట్టాలి. సాంకేతిక ఇబ్బందుల వల్ల డాక్యుమెంట్లు రానీ వాటిని సంబంధించిన సచివాలయ సిబ్బంది తిరిగి డేటా అప్లోడ్ చెయ్యాలన్నారు. ప్రతిరోజు కనీసం 10 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారన్నారు. స్పందన లో వొచ్చే ప్రతి దరఖాస్తు పరిష్కారం రాష్ట్ర స్థాయి సగటు లోబడే పరిష్కరించాలని ఆర్డీవో తెలిపారు. దరఖాస్తుల పరిష్కారం విషయంలో ఫిర్యాదుదారుని పక్షాన్న సహేతుకంగా వ్యవహరించాల్సి ఉందని మల్లిబాబు తెలిపారు.

కొవ్వూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి/ సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు ఎస్. మధుసూదన్ రావు మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో ఇంటి నిర్మాణం కోసం స్థలాలు కేటాయించిన ప్రతి లబ్దిదారుడు తప్పని సరిగా ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి చొరవ చూపాలని కోరారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వొచ్చిన లబ్దిదారుని కి రూ.5 వేలు, ఇప్పటికే బేస్ మెంట్ వరకు ఇంటి నిర్మాణం చేసిన వారికి రూ.15 వేలు ఆర్ధికంగా ముందస్తు భరోసా కల్పిస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.35 వేలు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్క లబ్దిదారుడు జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణం చేసుకోవాలన్నదే సీఎం ఆశయమన్నారు. ఇప్పటికే లే అవుట్ ల వద్ద ఇసుక, సిమెంట్, ఐరన్ అందుబాటులో ఉంచామన్నారు. దీనికి అదనంగా ప్రభుత్వ సబ్సిడీ పై మరో 50 బస్తాలు సిమెంట్ కూడా అందిన్నట్లు పేర్కొన్నారు. నరేగా కింద మరిన్ని పనిదినాలు కల్పించే దిశగా మండల స్థాయి అధికారులు, సిబ్బంది ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. నాడు-నేడు కింద పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి అన్ని పనులు పూర్తి అయ్యేలా ఎమ్ ఈ ఓ లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్తు, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలోహౌసింగ్ డిడిఓ పి.జగదాంబ, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, తహసీల్దార్ లు, ఎంపీడీఓ లు,కొవ్వూరు పురపాలక సంఘం అధికారులు, హౌసింగ్, ఆర్ డబ్ల్యూ ఏస్, విద్యుత్, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *