Breaking News

పెనమలూరు మోడల్‌ వసతి గృహాంగా తీర్చిదిద్దిన తరహలోనే జిల్లాలో 131 హాస్టళ్ల రూపురేఖలను మార్చాలి… : కలెక్టర్‌ జె.నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఆధునీక వసతులు కల్పించే మార్పు (చేంజ్‌) పథకంలో చేపడుతున్న పనులను జూన్‌ నాటికి పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. పెనమలూరులోని బాలికల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహానికి మరమత్తులు తీర్చిదిద్దిణ తరహలోనే జిల్లాలోని131 హాస్టళ్లల్లో మార్పు తీసుకురావాలని ఆయన కోరారు.
జిల్లాలోని 131 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల రూపురేఖలను ఆధునిక స్థాయిలో ‘‘మార్పు’’ తీసుకువచ్చేందుకు చేపట్టిన పనుల ప్రగతిపై నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, సమగ్ర శిక్షాభియాన్‌, ఏపిఎస్‌డబ్ల్యుఐడిసి శాఖాలకు చెందిన ఎఇలు, ఎఇఇలు డిఇలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ మాట్లాడుతూ జిల్లాలోని సాంఫీుక సంక్షేమ, వెనుకబడిన తరగతుల, ట్రైబల్‌ వెల్ఫ్‌ర్‌కు చెందిన 131 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల రూపురేఖలను ఆధునిక స్థాయిలో ‘‘మార్పు’’ తీసుకువచ్చే విధంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి జూన్‌ నాటికి సిద్దం చేయాలన్నారు. చేపట్టవల్సిన పనుల మేరకు రూపొందించిన అంచనాలకు అనుగుణంగా టెండర్లను తక్షణమే పిలిచి వారంలోగా పనులు ప్రారంభించి మూడునెలలలో వసతి గృహాలలో పనులను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వసతి గృహాలలో బాత్‌రూమ్‌లు, టాయిలెట్లలో సిరామిక్‌ టైల్స్‌, బ్రాండెడ్‌ కుళాయి కలెక్షన్లు, ఉండేలా చూడాలన్నారు. హాస్టళ్ల గదులకు వాల్‌ మౌటెండ్‌ కిటికిలు, అద్ధాలు, మస్కిటో నెట్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఫ్యాన్‌, ఎల్‌ఇడి బల్బుల్‌ కూడా అమర్చాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్కొక్క వసతి గృహానికి 20 లక్షలలోపుగా ఖర్ఛుచేసేవిధంగా అంచనాలను మరోకసారి సరిచూసుకోవాలన్నారు. ఆయా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య ఆదారంగా సౌకర్యాలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. నిరుపేద విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు జిల్లాలో చేపట్టిన మార్పు కార్యాక్రమానికి ఇంజనీర్లకు అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి చిరకాలం గుర్తించుకునేలా ఉండాలని కలెక్టర్‌ కోరారు.

పెనమలూరు మోడల్‌ వసతి గృహాం ఈనెల 26న ప్రారంభం…
ఈనెల 26 తేదీ శనివారం పెనమలూరు సాంఫీుక సంక్షేమ శాఖ బాలికల మోడల్‌ వసతి గృహా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్పు పథకంలో భాగంగా సంక్షేమ వసతి గృహాల్లో అధునీక వసతులు కల్పించడంలో భాగంగా రూపొందించిన మోడల్‌ వసతి గృహాం ఇతర వసతి గృహాలకు స్పూర్తి దాయకమని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) కె. మోహన్‌కుమార్‌, సాంఫీుక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్‌ కె. సరస్వతి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ వీరస్వామి, ఇఇ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్‌ ఎస్‌ఇ మురళిధర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యు ఎస్‌ఇ శాస్త్రి తదితర విభాగాలకు చెందిన డిఇలు, ఏఇలు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *