నగరంలో ఓకినోవా ఎలక్ట్రికల్ బైక్ షోరూం ప్రారంభం… 

 
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత తరుణంలో రవాణా చార్జీలు బాగా పెరిగిపోయాయి… పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతున్న పరిస్థితుల్లో దీనికి ప్రత్యామ్నాయంగా బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి… దీనిలో భాగంగానే ఓకినోవా బ్యాటరీ టూ వీలర్ వెహికల్స్ నగరంలో అందుబాటులోకి వచ్చాయి. ఏలూరు రోడ్, గుణదల లో అర్.అర్ ఇవి మోటార్స్, ఓకినోవా టూ వీలర్ బ్యాటరీ షోరూం ను తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితుల్లో వాతావరణ, శబ్ద కాలుష్యాన్ని అరికట్టే వాహనాల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇటువంటి వాహనాల వాడకం ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ప్రోత్సహిస్తున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపార రంగంలో నూతనంగా ప్రారంభించిన షోరూం యాజమాన్యాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ షోరూం మరింత అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షోరూం అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ గురిజాల హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ తో ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయని, మూడు గంటలు ఛార్జ్ చేసిన ఎడల 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించి వచ్చని చెప్పారు. పెట్రోల్ వెహికల్స్ కంటే కూడా దీనికి తక్కువ ఖర్చు అవుతుందని వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికడుతుందని తెలిపారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ నందు కనీస జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. ఈ వెహికల్ కు సంబంధించిన బ్యాటరీ ను ఎక్కడైనా రీఛార్జ్ చేసుకునే అవకాశం, సదుపాయం ఉన్నాయని తెలిపారు. ఈ వాహనాలు వ్యక్తులు ప్రయాణించడం తో పాటు లగేజిని కూడా తీసుకెళ్లే విధంగా రూపొందించబడ్డాయన్నారు. మా బ్యాటరీ వాహనాలు వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కలిగిన బ్యాటరీ వాహనాలు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందరికీ అందుబాటు ధరలతో వివిధ మోడల్స్ లో అందజేస్తున్నామన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకో వలసిందిగా కోరారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *