-విద్యార్ధులచే స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 పై అవగాహన ర్యాలీ.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చ్ సర్వేక్షణ్ పై ప్రజలలో అవగాహన కల్పించాలనే కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఎ.ఎస్ వారి ఆదేశాలకు అనుగుణంగా నేడు 39వ శానిటరీ డివిజన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్, D.S.M ఉన్నత పాఠశాల విద్యార్ధులచే నిర్వహించిన మెగా స్వచ్చ్ భారత్ ర్యాలి ని స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ తో కలసి ప్రారంభించారు. స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో మన నగరం ఉత్తమ ర్యాంక్ సాదించుటలో ప్రజలు స్వచ్చందగా నగరపాలక సంస్థ వారితో సహకరించాలని, కమిషనర్ గారి సూచనలకు అనుగుణంగా ప్రజలకు పరిసరాలు పరిశుభ్రత, తడి పొడి చెత్త వేరు చేసి అందించుట, సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మొదలగు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమములు ఏర్పటు చేస్తున్నట్లు హెల్త్ అధికారులు వివరించారు. విద్యార్ధులు బ్యానర్లు మరియు ప్లే కార్డులతో డివిజన్ పరిధిలోని అంబేద్కర్ రోడ్డు, గురుక్రుపారోడ్డు, సిమెంట్ రోడ్డు, అండమని బ్రహ్మయ్య రోడ్డు, వాసవి కన్యకా పరమేశ్వరి రోడ్డు వరకు ర్యాలి నిర్వహించారు. ఈ మెగా ర్యాలి నందు AMOH-III హెల్త్ ఆఫీసర్ డా. ఇక్బాల్ హుస్సేన్, శానిటరీ సూపర్ వైజర్ ఆర్.ఒబేశ్వరరావు, కె.శివరామప్రసాద్, డి.సోమరాజు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు బి.వి.సురేంద్ర, టి.బ్రహ్మరెడ్డి, జీ.శివకుమార్, యస్.రామకోటేశ్వర రావు, జీ.జమలయ్యబాబు, ఖురేషి, ఎ.వెంకటేశ్వర రావు, పి.వేణుగోపాలరావు మరియు శానిటరీ సెక్రటరీలు, పి.హెచ్.వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.