Breaking News

క్ష‌య వ్యాధిపై విసృతమైన అవ‌గాహన, ప్రచారం అవసరం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
క్ష‌య వ్యాధిపై విసృతమైన అవ‌గాహన, ప్రచారం అవ‌స‌రం ఎంతైనా ఉందని, ప్ర‌జ‌ల్లో వ‌చ్చే మార్పు వ‌ల్లే దీన్ని అరికట్టగలమని, చికిత్స మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
గురువారం ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు ఉదయం 7:30 గంటల సమయంలో హడావిడిగా తాడేపల్లి ప్రయాణమవుతూ, తన కార్యాలయంకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకొన్నారు.
తొలుత కృష్ణాజిల్లా క్షయవ్యాధి నివారణ సంస్థకు సంబంధించి మచిలీపట్నం టీబి యూనిట్ సిబ్బంది మంత్రి పేర్ని నానిని కలిశారు. మార్చి 24 వ తేదీ (నేడు) ‘ వరల్డ్ టీబి డే ‘ అని ఈ సందర్భంగా క్షయ వ్యాధి నిర్మూలనపై గురువారం మచిలీపట్నం ప్రధాన వీధులలో ఆరోగ్య కార్యకర్తలు , నర్సింగ్ విద్యార్థినీలతో ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. ఆ ర్యాలీకి సంబంధించిన బ్యానర్ మంత్రి చేత ఆవిష్కరింపచేశారు. జిల్లావ్యాప్తంగా 21 టీబి యూనిట్ల పరిధిలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారిణి డాక్టర్ జి. జి. జె. నాగలక్ష్మి తెలిపారు.
అనంతరం టీ బి హెల్త్ విజిటర్ కె. వి. ఎన్. సుధాకర్, సీనియర్ ట్రీట్మెంట్ సూపెర్వైజర్ విజయ గౌరీ , పి బి హెల్త్ విజిటర్ ప్రసాద్ బాబు , డాట్ ప్లస్ సూపెర్వైజర్ ధనలక్ష్మి , ఎం పి హెచ్ ఎస్ మురళిలతో మంత్రి పేర్ని నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్షయ అనేది ఒక అంటువ్యాధి అని, టీ బి వ్యాధి పట్ల ప్రజలకు క్షుణంగా మీరంతా తెలియచేయాలని సూచించారు. టీ బి మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌ కూలై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని,క్షయ రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో ట్యూబర్‌ కూలై బ్యాక్టీరియా వ్యాపిస్తుందని మనమందరం చదువుకున్నాం కానీ ఆ వ్యాధి పట్ల అప్రమత్తత ఎవరూ వహించడం లేదన్నారు. ఎంతో ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఒక్కసారి ఒంట్లోకి చేరిందంటే జీవితకాలం మన లోపలే రహస్యంగా దాక్కొని ఉంటుందన్నారు. ముఖ్యంగా మనలో రోగ నిరోధక శక్తీ తగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా చురుగ్గా మరింత వేగంగా మారుతుందనన్నారు. గతంలో టీబీ వస్తే రెండు మూడు నెలలు ఆసుపత్రులలో ఉండి చికిత్సలు తీసుకునేవారని , అయితే ఇప్పుడు ఆధునిక చికిత్సలు అందరికి అందుబాటులో వచ్చాయన్నారు.. టీబీ నుంచి కోలుకునేవాళ్ల సంఖ్య పెరిగిందని తెలిపారు క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని అమలులో ఉన్న పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ చర్యలు తీసుకుంటే సానుకూల ఫలితాలు సాధించవచ్చన్నారు.
మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మేకా చిన రాంబాబు మంత్రినిని కలిసి తన సమస్య చెప్పారు, డ్రైవర్ గా జీవనం కొనసాగించే తనకు పక్షవాతం వచ్చిందని కుటుంబ పోషణ ఎంతో భారంగా ఉందని వికాలాగుల పింఛన్ మంజూరు కావడం లేదని , సదరం నుంచి వికలత్వ శాత పత్రం సైతం అధికారులకు అందచేసినట్లు తెలిపారు.
నందిగామ మండలం చందర్లపాడు గ్రామానికి చెందిన ఇరువురు మంత్రిని కలిశారు. తమ తల్లి మల్లాది కృపావరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలని క్యాన్సర్ వ్యాధితో మరణించారని కారుణ్య నియామక ఉద్యోగానికి ఎంతో జాప్యం జరుగుతుందని తెలిపారు. స్పందించిన మంత్రి పేర్ని నాని జిల్లా పరిషత్ సి ఇ ఓ సూర్యప్రకాశరావు ఫోన్లో మాట్లాడి ఎక్కడ జాప్యం జరుగుతుందో పర్యవేక్షించాలని ఆదేశించారు

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *