-పరిసరాల పరిశుభ్రత మనందరి భాద్యత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్-1 పరిధిలోని 32, 34, 35 మరియు 56వ శానిటరీ డివిజనలలో స్వచ్చ్ సర్వేక్షణ్ పై ప్రజలలో అవగాహన కల్పిస్తూ నిర్వహించిన స్వచ్చ్ భారత్ ర్యాలిలో 34వ డివిజన్ కార్పొరేటర్ మరియు ఎ.పి.డి.ఐ.సి చైర్మన్ శ్రీమతి బండి నాగపుణ్యశీల, 32వ డివిజన్ కార్పొరేటర్ చన్నగిరి రామమోహన రావు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా చర్యలు చేపట్టాలనే కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ వారి సూచనలకు అనుగుణంగా ప్రజారోగ్య శాఖ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీతాభాయి అద్వర్యంలో విద్యార్ధులు మరియు శానిటరీ సిబ్బందిచే ఖుద్దూస్ నగర్ మసిది నుండి సెంట్రల్ వైర్ హౌస్, సి.కే రెడ్డి రోడ్ ద్వారా బి.ఆర్.టి.ఎస్ రోడ్ వరకు ర్యాలి నిర్వహించి స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞా చేసారు. మన విజయవాడ నగరాన్ని మొదటి ర్యాంక్ సాదించుటకు ప్రతి ఒక్కరు వారి భాద్యతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ నివారించి పర్యావరణాన్ని కాపాడుటలో భాగస్వాములై పరిసరాలు పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు. మనం ఉత్పత్తి చేయు చెత్తను తడి చెత్త మరియు పొడి చెత్తగా వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని, సింగల్ యూజ్ ప్లాస్టిక్ క్యారి బ్యాగ్ వాడకం నిషేదించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా ODF++, వాటర్ ప్లస్ సిటిగా ఉంచుతామని, చెత్త రహిత పరిశుభ్రమైన GFC 5 స్టార్ రేటింగ్ సిటిగా ఉంచుతామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞా నిర్వహించారు. ఈ మెగా ర్యాలి నందు హెల్త్ ఆఫీసర్ డా. కె. సురేష్ బాబు, శానిటరీ సూపర్ వైజర్ ఆర్.ఒబేశ్వరరావు, యం. రమేష్ బాబు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు ఆదినారాయణ, రాజు, ప్రతాప్, రంగారావు మరియు శానిటరీ సెక్రటరీలు, పి.హెచ్.వర్కర్లు ప్రభాస్ కాలేజీ విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.