ఎర్త్ అవర్ ప్రచారంలో పాల్గొనాలని గవర్నర్ విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాలు, నివాసాల వద్ద అనవసరమైన లైట్లను ఆర్పివేయడం ద్వారా ‘ఎర్త్‌ అవర్‌’ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించగల పరిరక్షణ, స్థిరమైన పద్ధతులను దృష్టిలో ఉంచుకోవడానికి ‘ఎర్త్ అవర్’ ప్రచారం దోహదపడుతుందని గవర్నర్ అన్నారు. ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 వరకు విజయవాడ రాజ్‌భవన్‌ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *