కొవ్వూరు / తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గ ప్రజలకు, ప్రతి తెలుగు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని శుక్రవారం ఒక ప్రకటన లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలియచేసారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన లో మంత్రి డా.తానేటి వనిత, శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ అన్నీ శుభాలు జరగాలని ఆమె ఆకాక్షించారు. తెలుగు ప్రజలు ఉగాది రోజున నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించు కుంటామన్నారు. ఈ వేడుకలలో ప్రజలు చేసుకునే ఉగాది పచ్చడి ఎలాగైతే షడ్రుచులు కలగలిపిన తీపి, చేదు, వగరు కలిగిన ఉంటుందో అలాగే మన జీవితాల్లో కూడా కష్టం, సుఖం లతో మిళితమై ఉంటుందన్నారు. మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సవాలు పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మంత్రి తానేటి వనిత తెలిపారు.
Tags kovvuru
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …