విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవారి సంక్షేమనికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించి, నియోజకవర్గ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా వార్డు పర్యటనలు చేపడుతున్నామని దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలో నిరుపేదల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 12వ డివిజన్ నుండి మొదలుపెట్టిన 6వ రోజు “గడప గడపకు వైస్సార్సీపీ” కార్యక్రమంలో భాగంగా స్థానిక డివిజన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ ఆధ్వర్యంలో అయ్యప్ప నగర్ లోని భగత్ సింగ్ రోడ్, గణేష్ రోడ్, శివాజీ రోడ్ మరియు నేతాజీ రోడ్ తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటిఇంటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. అలాగే అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ 12వ డివిజన్లో ఉన్నమెయిన్ రోడ్లు,సీసీ రోడ్లు,వాటర్ లైన్స్ శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ డివిజన్ లో దాదాపు 6కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ 60 లక్షల రూపాయల తో డ్రైన్ టు డ్రైన్ వేయడం జరిగింది అన్నారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ,కార్పొరేటర్ ఉండి కూడా గత 5 సంవత్సరాలు ఈ డివిజిన్ అభివృద్ధి ని పట్టించుకోలేదు అని దుయ్యబట్టారు.తీవ్ర సంక్షోభ సమయంలో ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శ పాలన సాగిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని,రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఇక్కడి షో మాస్టర్,టీడీపీ నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు కలలు కంటున్నారని అది ఎన్నటికీ జరగదు అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు ప్రవల్లిక, రహేన, అమర్నాధ్, సాంబయ్య, వైస్సార్సీపీ నాయకులు రిజ్వాన్,దనేకుల కాళీ, ఆళ్ల చెల్లారావు,సుబ్బరాజు, చిన్న, చిమాటా బుజ్జి తదితరులు పాల్గోన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …