Breaking News

టెలికం గుంటూరు జిల్లా సలహ కమిటి సబ్యునిగా నిమ్మరాజు


గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంతో ప్రతిష్టాకరమైన కేంద్ర ప్రభుత్వ టెలికం శాఖ గుంటూరు జిల్లా సలహా కమిటి సభ్యునిగా సీనియర్‌ జర్నలిస్ట్‌ నిమ్మరాజు చలపతిరావు నియమితులైనారు. శుక్రవారం BSNL జిల్లా ఎ.జి.ఎం ప్రసన్న కుమార్‌ నుంచి నియామక పత్రం అందుకొన్నారు. ఈ కార్యక్రం లో టెలికాం సబ్-డివిజనల్ అధికారి శ్రీ మొండితోక వెంకట్రావు పాల్గొన్నారు . టెలికాం శాఖ గుంటూరు జిల్లా కమిటీలో నిమ్మరాజు చలపతిరావుతో పాటు పార్లమెంట్‌ సభ్యులు  గల్లా జయదేవ్‌, లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా ఉన్నారు. నిమ్మరాజు చలపతిరావు ఇదే కమిటీలో 1998-2000 సంవత్సరంలో రెండు ఏళ్ళ పాటు సభ్యునిగా పనిచేశారు. చలపతిరావు 1980 నుంచి 2000 వరకు 20 ఏళ్ళ పాటు గుంటూరు జిల్లాలో ఆంధ్ర పత్రిక, ఆంధ్ర భూమి దినపత్రికలలో స్టాఫ్‌ రిపోర్టర్‌గా పని చేయడం జరిగింది. అదే సమయంలో APUWJ గుంటూరు జిల్లా కన్వీనర్‌, కార్యదర్శి మరియు అధ్యక్షునిగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శి గా కుడా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.

అభినందనల పరంపర
నిమ్మరాజు చలపతి రావు గుంటూరు జిల్లా టెలికాం సలహా కమిటి సభ్యునిగా నియమకం పట్ల APUWJ రాష్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు .ఐ.వి సుబ్బారావు,  చందు జనార్ధన్‌, ఐ.జె.యు నేతలు  కె. శ్రీనివాస రెడ్డి,  అంబటి ఆంజనేయులు,  నరేంద్ర రెడ్డి,  ఆలపాటి సురేష్‌,  సోమసుందర్‌, సామ్నా అధ్యక్ష, కార్యదర్శులు నల్లి ధర్మారావు, రమణా రెడ్డి, గుంటూరు జిల్లా నేతలు ఎ.కె మోహన్‌, ఏచూరి శివ, మీరా, గిరి, రమణా, పరమేశం, కిరణ్‌, ఫణి, పుల్లా రెడ్డి, బక్తవచ్చలం, పాతర్ల రమేష్‌, రవి కుమార్‌, నారాయణ మురలి, ఎడ్ల సునీల్‌, విజయవాడ అర్బన్‌ కమిటీ నేతలు  చావా రవి, కొండా రాజేశ్వరరావు,  సుబ్బారావు,  కిరణ్‌ (వసంత),  దారం వెంకటేశ్వరరావు,  షేక్‌ బాబు, తదితరులు అభినందనలు తెలిపారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *