-అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేసిన మంత్రి
-ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డ ఇద్దరు పిల్లలు ఒక తల్లి
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
పేద వాడికి ఆపదవస్తే క్షణాల్లో స్పందించే గుణం ఆయనది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిస్తే చాలు వైద్యుని అవతారం ఎత్తేస్తారు అందుకే పలాస నియోజకవర్గం ప్రజలు ఆయనను నడిచే దేవుడు అంటారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉందా ఆయనే మన రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. వివరాల్లోకి వెలితే… పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఒక మహిళ మనస్థాపానికి గురై తన పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటిలోనే ఇద్దరు పిల్లలకు విష పదార్థం తాగించి తను కూడా తాగేయడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ,స్థానికులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ ఆసిత్రి వైద్యులకు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ప్రాథమిక చికిత్స చేయమని తను వచ్చేలోగా అపస్మారక స్థితిలో ఉన్న వారికి వైద్యం అందించమని పోనులో సలహాలు సూచనలు అందించారు. ఈ లోగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్యం అందించారు. ఇద్దరు పిల్లలు ఒక మహిళ మొత్తంగా ముగ్గరు ప్రాణాలు కాపాడి దేవుడయ్యారు. మనిషికి కావాల్సింది ప్రాణం. ప్రాణం ఉంటేనే ఈ సమాజంలో అన్ని అందుతాయి. అలాంటి ప్రాణాలు పోతున్న వాటికి వైద్యం అందించి మల్లి పునర్జన్మను అందించారని బాదిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అన్నారు. క్షణికమైన ఆవేశాలతో తీసుకున్న నిర్ణయాలు ప్రాణాలను తీసేస్తాయని. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ముందుకు పోవాలని కోరారు. మనకు వీలైనంతగా పౌరుషాలకు పోకుండా దూరంగా ఉంటూ మనకు మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ముగ్గరు ప్రాణాలు కాపాడే విషయం నియోజకవర్గంలో ఒక్క సారిగా హాట్ టాపిక్ లా మారింది. ఎందు కంటే ఐదు సంవత్సరాలుగా వైద్య వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ సీదిరి అప్పలరాజు నేడు రాష్ట్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన చేపట్టిన వృత్తి వలన నిండు ప్రాణాలు కాపాడటానికి ఆయన మల్లీ వైద్యుడుగా అవతారం ఎత్తుతారనేది ఈ రోజు బొడ్డపాడు గ్రామస్తుల సంఘటనే నిదర్శనం. బొడ్డపాడు గ్రామస్తులంతా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకి కృతజ్ఞతలు తెలిపారు.