విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరికి కులం,పార్టీ,కులం అనేది చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుంది అని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం నాడు ఐదవ రోజు ‘గడప గడపకు వైస్సార్సీపీ’ కార్యక్రమంలో భాగాంగా స్థానిక 20వ డివిజన్ లో రణధీర్ నగర్ కట్ట ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్,రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు తో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సంక్షేమ పథకాల లబ్దిదారులకు జగనన్న ఉత్తరం ఇచ్చి వారికీ వచ్చిన ప్రతి పథకం గురించి వివరించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా కులమతాలకు, పార్టీలకతీతంగా పేదరికమే ప్రామాణికంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతఇల్లు మరియు సంక్షేమ పథకాలు కలను నిజం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచి, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని కరకట్ట వాసుల ప్రజల చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభిస్తా అన్నారు.రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం లో దాదాపు మూడు వేలకు పైగా ఇళ్ళు తొలగిస్తానికి ప్లాన్ రూపొందించారు అని, కానీ నేడు జగన్ కేవలం నష్టం ఎక్కువగా వున్న 524 ఇళ్లను మాత్రమే తొలగించి వారందరికి ఉచితంగా అత్యాధునిక సదుపాయాలతో ఉన్న నివాస గృహాలు అందజేస్తున్నాం అని,ఇప్పటికే 94 కుటుంబలని తరలించడం జరిగిందని, త్వరలోనే మిగతా వారికి కూడా పట్టాలు ఇచ్చి తరలిస్తామని తెలిపారు.ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపతిన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ,వైస్సార్సీపీ నాయకులు షేక్ సుబాని,ఎన్.ఎస్.రాజు,మాజీ కార్పొరేటర్ పల్లెం రవి,మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మీర్ హుస్సేన్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరక్టర్ విజయలక్ష్మి, స్టాండింగ్ కమిటీ మెంబర్లు అంబేద్కర్,రామిరెడ్డి, డివిజన్ నాయకులు పుప్పాల రాజా,మల్లి,కొప్పుల వెంకట్,రఫీ,శాస్త్రి,సాయి మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News