Breaking News

నేడే జిల్లా వ్యాప్తంగా 22 ఏ మెగా మేళా..

-పెండింగ్ ఆర్జీల పరిష్కరించుకోవాలని ఆర్జీదారులకు జిల్లా కలెక్టర్‌ పిలుపు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుదీర్ఘ కాలంలో అపరిష్కృతంగా ఉన్న ఆర్జీలను పరిష్కరించేందుకు నేడు జిల్లా వ్యాప్తంగా 22 ఏ మెగా మేళాను నిర్వహిస్తున్నామని ఆర్జీదారులు ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ఒక ప్రకటనలో కోరారు. నిషేదిత భూముల క్రమబద్దీకరణకు సంబంధించి సిసిఎల్‌ఏలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా 22 ఏ ధరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి అధికారం జిల్లా కలెక్టర్‌కు లభించిందన్నారు. సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక మెగా మేళాను చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని తహాశీల్థార్‌ ఆర్‌డివో, డిఆర్‌వో జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ కార్యాలయాలలో 22 ఏ కింద ధరఖాస్తులైన ఆర్జీలను మెగా మేళాలో పరిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *