Breaking News

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి…

-మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే మత్తు మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎం. జి. రోడ్డులోని పీవీపీ మాల్ నందు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం అన్నింటికంటే భయంకరమైన వ్యాధి అని అన్నారు. ఈ అలవాటు మానసికస్థితిపై ప్రభావం చూపడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తాయన్నారు. మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్ప‌డు దుష్ఫలితాలు గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మత్తు పదార్థాలు మానవుని మెదడుపై నేరుగా ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఫలితంగా ఆలోచనా శక్తి నశించి యువత నేరాలు బాట పడుతున్నారన్నారు. కావున యువత మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు ఉన్న ప్రాంతాలలో ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్ముతున్నా లేదా సేవిస్తున్నా వెంటనే పోలీసువారికి తెలియజేయాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం యాంటీ డ్రగ్ కాంపెయిన్ ప్రచార రథాన్ని జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు, వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నవ జీవన బాల భవన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నకుమార్, ప్రోగ్రాం మేనేజర్ జి. శేఖర్ బాబు, సభ్యులు కిరణ్ కుమార్, ఆంజనేయులు, రమేష్, వసంత్, అనూష పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *