Breaking News

జిల్లాలో సర్వీసు క్రమబద్దీకరణ అయిన సచివాలయం ఉద్యోగులు 4,452 మంది

-పట్టణ ప్రాంతంలో 137 సచివాలయాల్లో 1147 మంది
-గ్రామీణ ప్రాంతంలో 375 సచివాలయాల్లో మంది 3305 మంది

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 512 సచివాలయాల్లో పనిచేస్తున్న 4452 మంది కార్యదర్శుల సర్వీసు ను క్రమబద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ లోని 96 వార్డుల్లో 770 మంది , కొవ్వూరు మునిసిపాలిటీ లో19 వార్డుల్లో 171 మంది, నిడదవోలు మునిసిపాలిటీ లో 22 వార్డుల్లో 206 మంది సచివాలయం ఉద్యోగులు సర్వీసుని క్రమబద్దకరణ చెయ్యడం జరిగింది.

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల లో పనిచేస్తున్న వారి వివరాలు మండలాలు వారీగా తాళ్లపూడి 15 సచివాలయాల్లో 141 మంది, రంగంపేట 19 సచివాలయాల్లో 176 మంది, గోపాలపురం 18 సచివాలయాల్లో 173 మంది, కొవ్వూరు 10 సచివాలయాల్లో 88 మంది, నిడదవోలు 13 సచివాలయాల్లో 111 మంది ; గోకవరం 20 సచివాలయాల్లో 171 మంది, బిక్కవోలు 21 సచివాలయాల్లో 170 మంది, దేవరపల్లి 21 సచివాలయాల్లో 200 మంది, ఉండ్రాజవరం 19 సచివాలయాల్లో 167 మంది , రాజమహేంద్రవరం రూరల్ 35 సచివాలయాల్లో 289 మంది, నల్లజెర్ల 22 సచివాలయాల్లో 207 మంది, సీతానగరం 20 సచివాలయాల్లో 175 మంది, రాజానగరం 34 సచివాలయాల్లో 292 మంది, కోరుకొండ 24 సచివాలయాల్లో 222 మంది, చాగల్లు 18 సచివాలయాల్లో 169 మంది, కడియం 27 సచివాలయాల్లో 221 మంది, అనపర్తి 19 సచివాలయాల్లో 147 మంది , పెరవలి 20సచివాలయాల్లో 186 మంది సర్వీసు క్రమబద్ధీకరణ చెయ్యడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *