-సూక్ష్మ చిన్న మధ్య తరహ పరిశ్రమలు ఆర్థిక పురోగతికి దొహదం చేస్తాయి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూక్ష్మ చిన్న మధ్య తరహ పరిశ్రమలు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని దేశంలో సంపద సృష్టించేది మైక్రో స్మాల్ మీడియం (యంఎస్‌యంఇ) పరిశ్రమల పారిశ్రామిక వేత్తలేనని పారిశ్రామిక వాడలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహ పారిశ్రామిక వేత్తల దినోత్సవ సందర్భంగా స్థానిక ఆటోనగర్‌లోని ది విజయవాడ ఇండస్ట్రేయల్ ఎస్టేట్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ చిన్న మధ్య తరహ పారిశ్రామిక వేత్తలు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్ని పరిశ్రమలను నిర్వహించడం ద్వారా లక్షలాదిమందికి జీవనోపాది కల్పించడంతో పాటు ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నారన్నారు. దేశానికి సంపద సృష్టించేది సూక్ష్మ చిన్న మధ్య తరహ పారిశ్రామిక వేత్తలేనన్నారు. వ్యవసాయం తరువాత అత్యధిక శాతం మంది ప్రజలు పరిశ్రమల పై ఆధారపడుతున్నారన్నారు. దేశ అభివృద్ధి యంఎస్‌యంఇలపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా 63.4 మిలియన్ యూనిట్ల ద్వారా దాదాపు 120 మిలియన్ల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. భారత ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టి పనితీరు ఆధారంగా ప్రతి ఏడాది రాష్ట్రానికి ర్యాంక్‌కులను కేటాయిస్తుందని ఇందులో మన రాష్ట్రం నిరంతరం మొదటి ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం రాష్ట్రంలోనే సూక్ష్మ చిన్న మధ్య తరహ పారిశ్రామిక వేత్తల నైపుణ్యానికి నిదర్శనం అన్నారు. మన జిల్లాలో యంఎస్‌యంల అభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐటిఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ సంస్థల వంటి వృత్తిపరమైన కళాశాలలలో అదునాతనమైన కోర్సులలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు మేనేజర్లు యువ పారిశ్రామిక వేత్తలు పారిశ్రామిక సంఘాలతో సమావేశం నిర్వహించి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు, అందుబాటులో ఉన్నాయన్నారు. మరో రెండు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1960లో ప్రారంభమై దేశంలోనే ఆటోమొబైల్‌గా కీర్తిప్రతిష్టలు పొందిన ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే త్రాగునీరు, డ్రైనేజ్‌ల అభివృద్ధి పనులు చేపట్టామని సూక్ష్మ చిన్న మధ్య తరహ పారిశ్రామిక వేత్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుక తమ వంతు కృషి చేస్తానని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. కార్యక్రమంలో ఆటోనగర్ ఐలా అధ్యక్షులు సుంకర దుర్గాప్రసాద్, కొండపల్లి ఐలా అధ్యక్షులు రామలింగేశ్వరరావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఏపిఎస్‌ఐఏ అధ్యక్షులు వి మురళికృష్ణ, కార్యదర్శి రామచంద్రరావు, ఐలా కమీషనర్ రaన్సీలక్ష్మి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ జనరల్ మేనేజర్ వసంత కుమార్, జిల్లాకు చెందిన సూక్ష్మ చిన్న మధ్య తరహ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News