Breaking News

ఒక ప్రణాళిక ప్రకారం శానిటేషన్ మెరుగుపరచడానికి మార్గదర్శకాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ విజయవాడ అధికారులు ఈరోజు తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరిగిన మీటింగ్ లో అన్ని సచివాలయాల వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రెటరీ లు పాల్గొనటం జరిగినది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.సత్యవతి మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్ లో మన విజయవాడ మునుపటి సంవత్సరం 3వ ర్యాంకు సాధించుటలో అందరి సమిష్టి కృషిని కొనియాడి ఈ సంవత్సరం కూడా ఇంకా మెరుగైన ర్యాంక్ సాధించుటలో భాగంగా అన్ని డివిజన్ లలో ఒక ప్రణాళిక ప్రకారం శానిటేషన్ మెరుగుపరచడానికి మార్గదర్శకాలు వివరించడ జరిగినది. అదేవిధంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డా. బాబు శ్రీనివాసన్ మాట్లాడుతూ జులై 1వ తారీకు నుండి విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ వారి మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టిక్ బ్యాన్ ను పూర్తి స్థాయిలో అమలుచేయవల్సిందిగా ఆదేశించడం జరిగినది.ఈ కార్యక్రమంలో అందరూ AMOH లు, శానిటరీ supervisor లు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు పాల్గొనటం జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *