-వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమైంది
-జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క ప్రజా సమస్య కూడా పరిష్కారానికి నోచుకోవట్లేదని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని, కేవలం అక్రమ సంపాదన, అవినీతి మీదే దృష్టి పెట్టారని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమైందని, అందుకనే ఇంటింటికి వెళుతున్న వైఎస్ఆర్సిపి నాయకులని ప్రజలు చీదరించుకుంటున్నారని, మీలో ఒకడినని మీ సమస్యలు తీరుస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని తాడేపల్లి ప్యాలెస్కే జగన్ మోహన్ రెడ్డి అంకితమైపోయారని, సీఎం గారు బయటకు రాకపోతే ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో సమాధానం చెప్పాలని, సామాన్య ప్రజల సమస్యలు వినడానికి అధికార పార్టీ నాయకులకు తీరికలేదని, మూడు సంవత్సరాల నుంచి సమస్య ఏదైనా కానీ కుల మత రహిత కులమతాలకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని,బాధిత పక్షాలకు అండగా నేనున్నానని పవన్ కళ్యాణ్ గారు జనవాణి జనసేన భరోసా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, జనవాణి జనసేన పేరుతో భరోసా వేదిక ద్వారా బాధిత ప్రజలు కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు ప్రజాసంఘాలకు అండగా నిలుస్తారని ,సమస్య ఏదైనా ఎవరిదైనా పార్టీలకు అతీతంగా అండగా నిలబడి వారి సమస్యలకు పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి జనసేన భరోసా జరుగుతుందని, విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి పేదలు వచ్చి అర్జీలు ఇవ్వవచ్చుని తెలిపారు.
Prajavartha Online Telugu News