నూతన క్యాంటిన్ భవన నిర్మాణానికి భూమి పూజ…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో రూ.55 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న జీ+1 క్యాంటిన్ కమ్ రిఫ్రెష్మెంట్ భవన నిర్మాణమునకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, అధికారులు మరియు సిబ్బందితో కలసి భూమి పూజ నిర్వహంచారు. ఈ సందర్బంలో మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించు సిబ్బందికి మరియు వివిధ పనుల మీద వచ్చు ఇతర సిబ్బందికి, ప్రజలకు సరైన క్యాంటిన్ అందుబాటులో లేకపోవుటతో రూ. రూ.55 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో నూతన భవనము నిర్మాణమునకు చర్యలు తీసుకోవటం జరిగిందని, దీనిలో డైనింగ్ ఏరియా, కిచెన్ మరియు సిబ్బందికి కొరకు రిఫ్రెష్మెంట్ కమ్ డైనింగ్ హాల్ నిర్మించనున్నట్లు తెలియజేసారు. ఈ సందర్బంలో జీ.2 భవన నిర్మాణము చేపట్టుటకు గల అవకాశాలు పరిశీలించాలని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. తదుపరి కార్యాలయంలోని నూతన భవనమును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తూ, నిల్చిన నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించునట్లుగా చూడలని సంబందిత అధికారులకు సూచించారు. కార్యక్రమములో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరెడ్డి, ఇతర అధికారులు మరియు వి.యం.సి మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *