Breaking News

కాపు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మహా ధర్నా’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రేజర్వేషన్ల కాపు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక గాంధీ నగర్ ధర్నా చౌక్ లో వ్యవస్థాపకులు రొక్కం శివ శంకర్ రాయుడు మాట్లాడుతూ విదేశీ విద్యాదీవెన కాపు విద్యార్థులకు విదేశాలకు వెళ్లిన వారికీ తక్షణమే పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేయాలనీ, కాపు కార్పొరేషన్ నిధులను నవరత్నాల లో భాగం చేయవద్దని కాపు కార్పొరేషన్ గతం లో ఇచ్చిన ఉపాధి లోన్ లను (ఎం.ఎస్.ఎం.ఈ) లోన్ లను పునరుద్ధరించాలని ఫీజు రియంబర్స్మెంట్, అమ్మ వడి పథకాలలో పొరపాట్లను వెంటనే సవరించాలని ఆయన కోరారు. సెంట్రల్ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధా కృష్ణా మాట్లాడుతూ కాపుసంఘాలు పార్టీల కతీతంగా కలిసి కట్టుగా పని చేయాలనీ పిలుపునిచ్చారు. ఏ ఐ సి సి నగర అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహారావు మాట్లాడుతూ కాపు సంఘాల సమస్య లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో కాపు సంఘ, రాష్ట్ర కాపు నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *