ప్లాస్టిక్ గ్లాసులు పై నిషేధం మరో రెండు సంవత్సరాల వరకూ ఎత్తివేయాలి… : రామరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ ధర్మో ఫార్మర్ అసోసియేషన్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలోత్సవం భవన్ లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరికోండ రామరాజు మాట్లాడుతూ ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల పై జులై 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంలో భాగంగా సామాన్యులు ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు పై విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించాలని ఏపీ ఫార్మర్స్ అసోసియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకూ విజ్ఞప్తి చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అందరికీ అవసరమైన డిస్పోజల్ గ్లాసుల పై నిషేదం విధించడం బాధాకరమని, మరో రెండు సంవత్సరాల వరకు నిషేధం ఎత్తివేయాలని 100 మైక్రాన్ గ్లాసుల తయారీకి అనుమతి ఇవ్వాలని కోరారు. తదనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్లాసుల వాడకం ఎక్కువగా ఫంక్షన్ హాల్ లో ఉంటుందని ఎక్కడపడితే అక్కడ వాటిని పడవేయరని పైగా 100% సైక్లింగ్ చేయవచ్చని చెప్పారు. రీసైక్లింగ్ కు అవకాశం లేని మల్టీనేషనల్ కంపెనీల కుర్కురే, లేస్ ల లాంటి కవర్లకు అనుమతి ఇచ్చి గ్లాసుల పై నిషేదం విధించడం సబబు కాదని ప్రజలకు అతి తక్కువ ధరకే ప్లాస్టిక్ గ్లాసులు అందుబాటులో ఉంటాయని అందుకు ప్రత్యామ్నాయంగా సూచించే గ్లాసుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని దీనివలన ప్రజలపై భారం అధికంగా పడుతుందని, గ్లాసులు తయారు చేసే పరిశ్రమలు వెయ్యి దాకా ఉన్నాయని వీటి మీద ఆధారపడి 2000 ఆక్సిలరీ కంపెనీలు ఉన్నాయని, వాటిలో పనిచేసే 5 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ నిషేధం వలన బ్యాంకులకు రుణాలు కట్టలేక పరిశ్రమల యాజమాన్యం రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి సుబ్బారావు, అసోసియేషన్ నాయకులు జి .సుధాకర్, పి. సుమన్, సత్యవతి, శ్యామ్, నాగేశ్వరరావు, రామ్మోహన్ రావు, బద్రి , సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *