Breaking News

ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని కాపాడండి… : ముస్తఫా అంబేద్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అవలంభిస్తున్న వీర బాధుడికి లారీ ఓనర్స్ ఆత్మహత్య లు చేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారని, జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్తఫా అంబేద్కర్ స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ పోర్ట్ రంగం లో గ్రీన్ టాక్స్ 200 రూపాయలు ఉన్న టాక్స్ ను 14000 రూపాయలు పెంచారని ఒకప్పుడు ఫిట్నెస్ 1000 రూపాయలు ఉన్న టాక్స్ 13700 రూపాయలు పెంచారని అవి కట్టలేక లారీఓనర్ లు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు టాక్స్, ఇన్సూరెన్స్, టోల్ టాక్స్ కడుతున్న మేము గ్రీన్ టాక్స్ ఎందుకు కట్టాలి? అని డిమాండ్ చేశారు. అసలే డీజిల్ రేట్ విపరీతంగా పెరిగిపోయి, సరైన కిరాయిలు లేక ఫైనాన్స్ లు కట్టలేక ఓనర్ లు ఆత్మ హత్యలు చేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని ట్రాన్స్ పోర్ట్ వాహనాల లో రానివడం లేదని కానీ రైల్వే ద్వారా వస్తున్నాయని అవి వెంటనే అరికట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేనా రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివ దత్ మాట్లాడుతూ ట్రాన్స్ పోర్ట్ రంగం లో ప్రభుత్వం టాక్స్ రూపంలో అత్యధికంగా భారం మోపి లారీ ఓనర్స్ ఆత్మహత్య లకు పాల్పడే స్థితికి ప్రభుత్వం దిగజారింది అని ఆవేదన వ్యక్త పరిచారు.వెంటనే టాక్స్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఇతర రాష్ట్ర ల నుండి ట్రాన్స్ పోర్ట్ ద్వారా ధాన్యం తీసుకురావడానికి అనుమతులు ఇవ్వాలని, ఆంధ్ర తెలంగాణా సింగిల్ పర్మిట్ జి ఓ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మద్దిపాడు ఏ. వినాయక రాజు, టంగుటూరు ఏ వి నరస రాజు, ఏలూరు వెంకట కృష్ణా రావు, యూనియన్ మెంబర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *