జాతీయ స్థాయిలో బిసి హక్కుల సాధనకై చలో ఢిల్లీ


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ “చలో ఢిల్లీ” బిసి హక్కుల సాధనకై ఆగస్టు 2,3 ల తేదీలలో జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామనీ , చట్ట సభల్లో బిసిలకు 50%రిజర్వేషన్ ఇవ్వాలని జనాభా ప్రాతిపదికన కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తేవాలని ఆర్. కృష్ణయ్య ఆదేశాలు మేరకు సంఘాన్ని ముందుకు తీసుకువెళతామని అన్నారు. తదనంతరం రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు యలగాల నూకాలమ్మ మాట్లాడుతూ బీసిలకు చట్టసభల్లో , స్థానిక సంస్థల్లో, అసెంబ్లీ, పార్లమెంటు లో 50%రిజర్వేషన్ కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిసిలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇన్ని సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి జీవోలు సొదించుకున్న చరిత్ర బిసి సంక్షేమ సంఘానికి ఉన్నదని , కుల , మత రాజకీయ బేధం లేకుండా “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని అన్ని జిల్లాల నుంచి అధ్యక్షులు , కార్యదర్శులు , నియేజకవర్గ అధ్యక్షులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యన్. టి.ఆర్ జిల్లా అధ్యక్షులు మనబోతుల నరసింహరావు , విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన వెంకటేశ్వరరావు , కాకినాడ జిల్లా కార్యదర్శి అప్పికొండ అప్పలరాజు, కడపజిల్లా అధ్యక్షులు బుర్ర గోపలయ్య యాదవ్ , మచిలీపట్నం రాష్ట్ర కా‌ర్యదర్శి షేక్ మౌళాలి , అధ్యక్షులు టి.యస్.యన్ మూర్తి , బిసి సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *