జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లమెంట్‌ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం…

-50 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు హాజరైన 10,235 మంది విద్యార్థులు
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. జిల్లాలో ప్రారంభమైన పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పరిశీలించారు. కంచికచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 50 పరీక్ష కేంద్రాల ద్వారా ఏర్పాటు చేశామని10,235 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఈనెల 15 వ తేది వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటుంటి లోటుపాట్లు లేకుండా అవనమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 568 పాఠశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 107 మంది అధికారులను ఛీఫ్‌ సూపరింటెండెంట్‌గా నియమించామన్నారు. ఒకొక్క ఫైయింగ్‌ స్కాడ్‌లో విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్‌ అధికారులను నియమించడం జరిగిందన్నారు. 4 ఫైయింగ్‌ స్కాడ్‌ల ద్వారా జిల్లాలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, నిరంతరాయంగా విద్యుత్‌
సరఫరా చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తుని ఏర్పాటు చేసి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *