విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటిఎస్)కు నిర్థేశించిన లక్ష్యాలను రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. కంచికచర్ల మండల కార్యాలయం నుండి బుధవారం ఓటిఎస్, గృహ నిర్మాణాల ప్రగతిని జిల్లా కలెక్టర్ డిల్లీరావు జిల్లాలోని ఆర్డీవోలు, స్పెషల్ ఆఫీసర్స్, ఎంపిడివోలు, తహశీల్థార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో ఓటియస్‌లో రిజిస్ట్రేషన్, డిజిటల్ సైనింగ్, వంటి పలు అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి గృహ హక్కును కలుగజేసి మహోత్తర కార్యక్రమంలో అధికారులు భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో ఒటిఎస్ గృహాలు 32,119 ఉండగా 25,066 రిజిస్టేషన్ అయ్యాయన్నారు. మిగిలిన వాటి గృహాల రిజిస్టేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్‌లో ఆన్‌లైన్ డేటా డిజిటల్‌సైన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంచాయతి సెక్రటరీలకు, డిజిటల్ అసిస్టెంట్లకు సమన్వయం ఉండాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు దిగువ స్థాయి సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల తహాశీల్థార్లు ఎప్పటికప్పుడు పెండిరగ్ లేకుండా ఓటిఎస్ ప్రక్రియను అమోదించాలని అనంతరం ప్రింటింగ్ ప్రక్రియ, డాక్యుమెంట్, విఆర్వో అమోదం, అనంతరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కలిగిన పంచాయతీ సెక్రటర్లు, స్కానింగ్ అప్రూవల్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. తహాశీల్థార్లు, ఎంపిడివోలు స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓటిఎస్ పై సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా సర్వర్, ఇంటర్నెట్, పవర్ తదితర సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ద్వారా ఓటిఎస్ ప్రక్రియను వేగవంతం చేయగలుగుతామన్నారు. పంచాయతీ సెక్రటరీలు తమతోపాటు వాలంటీర్లను కూడా తీసుకెళ్లడం ద్వారా డాక్యుమెంటేషన్‌కు అవసరమయ్యే ఆధార్, ఫోటోస్ తదితర వాటిని సేకరించుకునేందుకు వీలుంటుందన్నారు. డాక్యుమెంట్ ఉపయోగాన్ని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ అన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట (ఓటిఎస్) ప్రక్రియ ఏ స్థాయిలోనూ పెండిరగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. వీడియోకాన్పరెన్స్‌లో విజయవాడ నుండి జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్‌కుమార్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, హౌసింగ్ పిడి శ్రీదేవి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News