విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు బుధవారం బందర్ రోడ్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ నందు ఈస్ట్ జోన్ డిప్యూటి పోలీస్ కమీషనర్ విశాల్ గున్ని ఐ.పి.ఎస్. నగరంలోని అన్ని బార్, రెస్టారెంట్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.సి.పి. విశాల్ గున్ని ఐ.పి.ఎస్ మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత, మీరందరు ఇందులో బాగస్వామ్యం కావాలని, ప్రతి బార్ మరియు రెస్టారెంట్ ల వద్ద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సి.సి.కెమరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. రాత్రి 11 గంటల తరువాత ఎత్తి పరిస్థితులలో మద్యం అమ్మరాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి బార్, రెస్టారెంట్ లలో పనిచేయడానికి వచ్చిన వారి పూర్తి వివరాలను తెలుసుకున్న తరువాతనే పనిలో పెట్టుకోవాలని చెప్పారు. అక్రమ మద్యంను గాని ఎక్ష్సైజ్ డ్యూటీ చెల్లించని మద్యం గాని అమ్మరాదని తెలియజేసారు. బార్ మరియు రెస్టారెంట్ పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందిని కలిగించకుడదు, ట్రాఫిక్ పరంగా కూడా చాల జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పార్కింగ్ విషయంలో జాగ్రతలు తీసుకోవాలి, బార్, రెస్టారెంట్ ల వద్ద ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే ఆయా ప్రాంతం పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, దీనివలన శాంతి భద్రతల సమస్యపై ద్రుష్టి సారించే అవకాశం వుందని చెప్పారు, బార్, రెస్టారెంట్లు నివాస ప్రాంతాలలో వుండే వాటిపై విచారించి మునిసిపల్ ఆధారిటీ వారికి లేఖలు వ్రాస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ జోన్ డి.సి.పి కే.బాబురావు ఐ.పి.ఎస్, ఏ.డి.సి.పి.లు ఏం.సత్తిబాబు, కే.శ్రీనివాసరావు, ఏ.సి.పి.లు డా. హనుమంత రావు, డా. రవి కిరణ్ , ఖాదర్ బాష , సి.హెచ్.శ్రీనివాసరావు, జి.వి. రమణమూర్తి, వి.ఎస్.యెన్.వర్మ, ఇనస్పెక్టర్లు, ఎస్.ఐ.లు, సిబ్బంది మరియు సుమారు 100 మంది బార్ మరియు రెస్టారెంట్ యజమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News