Breaking News

విద్యార్థులకు భోజనం సరఫరా చేసేందుకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వనం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. బిఆర్‌ అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ నందు విద్యార్థులకు భోజనం సరఫరా చేసేందుకు అర్హత గల పంపిణీ దారుల నుండి సీల్డ్‌ టెండర్లు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా సాంఫీుక సంక్షేమ అధికారిణి బి విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు భోజనం సరఫరా చేసేందుకు ఆసక్తి కలిగిన గుత్తేదారులు ‘‘డిస్ట్రిక్ట్‌ ఎస్‌సి వెల్ఫెర్‌ అండ్‌ ఎన్‌ఫవర్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎన్‌టిఆర్‌ డిస్ట్రిక్ట్‌ విజయవాడ’’ పేరున 3 వేల రూపాయల డిమాండ్‌ డ్రాప్ట్‌ను అందజేసి టెండర్‌ ఫారం తీసుకోవాలని తెలిపారు. పూర్తి చేసిన టెండర్‌ ఫారంతో పాటు 25 వేల రూపాయలు ధరావతు సొమ్ము డిమాండ్‌ డ్రాప్ట్‌ను పూర్తి చేసి టెండర్‌ ఫారంతో జత చేసి ఈనెల 8వ తేదీ సాయంత్రం 5గంటల లోగా విజయవాడ పటమట పంటకాలువరోడ్డు మారుతినగర్‌నందు గల తమ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా సాంఫీుక సంక్షేమ అధికారిణి బి విజయభారతి ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *