అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు…

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు క్షేత్రస్థాయిలో భూముల సేకరణ గుర్తింపు చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం సీతానగరం కోరుకొండ మండలాల్లో మండల అధికారులు గుర్తించిన పలు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఉంటే కచ్చితంగా ఇంటి స్థలం కేటాయించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. ఇప్పటికే అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా, ఇంటి నిర్మాణ దశలో అండగా నిలవడం జరుగుతోందన్నారు. ఇంటి స్థలం పొందిన లబ్ది దారులు ఖచ్చితంగా ఇంటి నిర్మాణ పనులను చేపట్టి ప్రభుత్వం అందచేయుచున్న లబ్ది ద్వారా ప్రయోజనం పొందాలని సూచించారు. జగనన్న కాలనీలో నూతన లబ్ధిదారులకు భూసేకరణలో భాగంగా సీతానగరం మండలం చిన్న కొండేపూడిలో 2 ఎకరాలు, నాగంపల్లి లో 1.75 ఎకరాలు, రఘుదేవపురం లో చుట్టు మెట్టు వద్ద సేకరించిన భూములను జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ వెంట సీతానగరం తాహాసిల్దార్ సత్యనారాయణ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *