Breaking News

సౌజన్య ఆర్థోపెడిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని వన్టౌన్ ప్రాంతంలోని కోమల విలాస్ సెంటర్ లో ఉన్న సౌజన్య ఆర్థోపెడిక్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమం సోమవారం నుండి మూడు రోజుల పాటు ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు సౌజన్య ఆర్థోపెడిక్ సెంటర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సూర్య నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం హెల్ప్ హాస్పిటల్ వారి సహకారంతో గుండె వ్యాధుల నిపుణులు కన్సల్టేషన్, గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండోరోజు మంగళవారం సౌజన్య ఆర్థోపెడిక్ సెంటర్ సహకారంతో ఎముకలు కీళ్లకు సంబంధించిన వ్యాధి పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బుధవారం అభయ హాస్పిటల్ వారి సహకారంతో పనులు కిడ్నీకి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ మూడు రోజులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో హెల్ప్ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది. సౌజన్య ఆర్థోపెడిక్ సెంటర్ డాక్టర్లు, సిబ్బంది, అభయ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *