Breaking News

అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆయన క్యాంప్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.
ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కాన్స్‌రెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు జిల్లా అధికారులతో భారీ వర్షాలపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎగువున కురుస్తున్న భారీ వర్షాల వలన కృష్ణానదీకి వరద వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కృష్ణానదీ తీర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాల వారిని ముందుగా అప్రమత్తం చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, వంటి వాటిని కృష్ణానదీ తీరప్రాంతాలలో సంచరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ భూములకు ఎటువంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలన్నారు. రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి అయినట్లయితే ముందస్తుగానే వసతి గృహాలకు తరలించేలా ఏర్పాటుచేయాలన్నారు. భారీ వర్షాల, ఈదురు గాలుల వలన విద్యుత్‌ తీగలు, స్థంభాలు నేలకు వరిగే అవకాశాలు ఉన్నందున విద్యుత్‌ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్‌ అధికారులు ఎప్పటికప్పడు వరద నీటిని పరిశీలించాలించాలని కలెక్టర్‌ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *