-పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై సమీక్ష అధికారులకు పలు సూచనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు పశ్చిమ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్., డివిజన్ కార్పొరేటర్లతో కలిసి అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని 38,41,44 మరియు 45 డివిజన్లకు సంబంధించిన సమస్యల పై మరియు చేపట్టిన చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రధానంగా ఆయా డివిజన్లలో టెండర్లు ఆమోదించి ఇంకను పనుల ప్రారంభించవలసిన పనుల వివరాలతో పాటుగా చేపట్టిన పనుల యొక్క స్దితిగతులు మొదలగు వివరాలు అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. వీటితో పాటుగా డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, వీది దీపాల నిర్వహణ వంటి పలు సమస్యలను పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు షేక్ రహమతున్నీసా, మొహమ్మద్ ఇర్ఫాన్, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురీ లావణ్య మరియు అధికారులు యం.ప్రభాకర రావు, చీఫ్ ఇంజనీర్, యం.శ్యామల, అదనపు కమిషనర్(జనరల్), కె.వి సత్యవతి, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్), చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్ ఎస్.ఇ నరశింహ మూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News