Breaking News

ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు మేలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 2 లక్షల విలువైన ఎల్ఓసి పత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64వ డివిజన్ రాధానగర్ కు చెందిన కసగోని చెన్నకేశవ కుమార్ (27) గత కొద్దికాలంతో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కుటుంబ ఆర్థిక దుస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. రూ. 2 లక్షల విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎల్ఓసి పత్రాన్ని కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. వివిధ కారణాల చేత పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నప్పుడు వారికి ఆర్థిక భారం విపరీతంగా పడుతుందని, అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి ఉదారంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కోట్లాది రూపాయలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్రంలోనే సీఎంఆర్ఎఫ్ నిధులు పొందడంలో సెంట్రల్ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 885 మందికి రూ. 4 కోట్ల 10 లక్షల 6 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. 87 మందికి రూ. 2 కోట్ల 25 లక్షల 12 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. కనుక ఆపద వస్తే అధైర్యపడకుండా.. ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోగులు కూడా ఆరోగ్యశ్రీ ఉన్న ఆస్పత్రులపై అవగాహన కలిగి ఉండాలని.. ప్రజల సౌకర్యార్థం ప్రతి ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్కులను ఏర్పాటు చేసి ఆరోగ్య మిత్రలను నియమించినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ పార్టీ కార్యాలయంలోనూ ఓ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి లబ్ధిదారుని కుటుంబసభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *