విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన తరువాత ప్రజలు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడితే వారు సామంతులులా ప్రజలను దోచుకుతిన్నారని, ఆ ఐదేళ్ల పాలన మొత్తం అవినీతిమయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ సతీష్ కుమార్ రోడ్ నుండి మొదలై అన్నమ్మ తల్లి గుడి రోడ్, నిమ్మకాయల లక్ష్మణ్ రాడ్, వడ్డెర వెంకయ్య రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాలను కరపత్రాల రూపంలో అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకవైపు గత ప్రభుత్వం చేసిన బకాయిలు చెల్లించుకుంటు మరోవైపు ఎవరికి ఎలాంటి లోటు లేకుండా మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలు అమలు చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన దక్షత వలనే సాధ్యం అయ్యింది అని కొనియాడారు. గతంలో ఎవరికైనా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి లంచాలు ఇస్తే గాని అయ్యే పరిస్థితి లేదని,సొంత పార్టీ కార్యకర్తల దగ్గరే లంచాలు వసూలు చేసిన ఘనత టీడీపీ వారిది అని ఎద్దేవా చేశారు. టిడ్కొ పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేసింది ఎవరో అందరికి తెలుసని అన్నారు.జగన్ గారు వారికి కూడా న్యాయం చేసే విధంగా వారు కట్టిన డబ్బులు వెనక్కు ఇచ్చి, కేవలం ఒక్క రూపాయికే నివాస గృహం అందజేస్తుంటే చూసి ఓర్వలేక వారి రాజకీయ మనుగడ కోసం స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని, రిటైనింగ్ వాల్ పేరుతో నిధులు కాజేసి నాసిరకం నిర్మాణం చేపట్టింది మీరు కదా అని ప్రశ్నించారు. కులమత పార్టీఅలకటితంగా పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ 30 లక్షల మంది కి ఇళ్ళ పట్టాలు అందజేసిన ఘనత మా ప్రభుత్వం దే అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దుర్గారావు, గోపాల్ రెడ్డి, ప్రబాకర్ రెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, ఫజులుద్దీన్, ప్రభాకర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …