తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 23 న చిత్తూరు జిల్లా కుప్పంలో ఐదవ విడత చేయూత కార్యక్రమంలో పాల్గొనటానికి ఉదయం 10.05 గం. లకు ప్రత్యేక విమానంలో రేణిగుంట ఏర్పొర్టు చేరుకుని 10.15 గం లకు హెలికాప్టర్లో కుప్పం బయల్దేరి వెళ్తారని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంకు మధ్యాహ్నం 1.50 గం. లకు చేరుకుని గం. 1.55 గం. లకు విజయవాడకి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ASL ముందస్తు భద్రత ఏర్పాట్ల సమావేశంలో తెలిపారు.
గురువారం రేణిగుంట విమానాశ్రయం లో ఏర్పాటు చేసిన ASL సమావేశంలో జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జెసి డీకే బాలాజీ, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యశాఖ స్పెషలిస్ట్ డాక్టర్లు, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, నారాయణాద్రి హాస్పిటల్ ను సేఫ్ హౌస్ గా ఏర్పాటు చేసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ ఫైటింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తదితర శాఖలు వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ఏర్పోర్ట్ లో వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించి భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని తెలిపారు.
అనంతరం అధికారులు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరి గౌరవ ముఖ్యమంత్రి 27, 28 తేదీలలో తిరుపతి పట్టణంలోని కరకంబాడీ రోడ్డులోని లెప్రసి హాస్పిటల్ నుండి లీలామహల్ మీదుగా కపిల తీర్థం నిర్మాణం పూర్తి అయిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ప్రారంభించు సందర్భంగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జే ఈ ఓ వీరబ్రహ్మం, సి ఈ నాగేశ్వర్ రావుతో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రామారావు, ఏర్పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్, సి ఎస్ ఓ రాజశేఖర్, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, జిల్లా ఫైర్ అధికారి రమనయ్య, ఆర్డీవో శ్రీకాళహస్తి రామారావు, డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్, మునిసిపల్ ఈ ఈ చంద్ర శేఖర్, తసిల్డార్ రేణిగుంట శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.