Breaking News

గన్నవరం ఏపీ ఎన్జీఓస్ ప్రమాణస్వీకారం

-ఐక్య పోరాటాలే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం.. ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఐక్య పోరాటలే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమని, గత 70 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక ఐక్య పోరాటాల ద్వారానే, నేడు ఉద్యోగులుగా అనుభవిస్తున్న అనేక రాయితీలను, సదుపాయాలను మనం పొందగలుగుతున్నామని ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీవోస్ యూనిట్ గన్నవరం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గన్నవరం ఎన్జీవో హోమ్ నందు ఆదివారం నాడు ఎన్నికల అధికారి యం రాజుబాబు నూతనంగా ఎన్నికైన వి సాంబశివరావు, వి వంశీ కృష్ణ మోహన్ ప్యానల్ సభ్యులతో ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏపీ ఎన్జీవోస్ సంఘ పశ్చిమ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్, కార్యదర్శి యండి ఇక్బాల్ హాజరైనారు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఉద్యోగులతో సమావేశాన్ని నూతన అధ్యక్షుడు వి సాంబశివరావు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్స్ అందరూ ఐకమత్యంగా మన హక్కులకోసం, డిమాండ్స్ సాధన కోసం ,సంఘం ఇచ్చే కార్యాచరణకు కట్టుబడి పనిచెయ్యలన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఏర్పడిందని, నెల నెల జీతాలు కూడా సరైన సమయానికి రాని పరిస్థితిలో ఉన్నామని ఆయన అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉద్యోగుల పాలిట పెను సమస్యగా మారిందని, అవసరాల కోసం ఉద్యోగులు పెట్టుకుంటున్న జిపిఎఫ్ బిల్లులు ఇన్సూరెన్స్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులు సంవత్సరాల తరబడి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంటున్నాయని, ఉద్యోగులు బిల్లులు మంజూరు రాక, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి పరిస్థితి ముందేన్నడు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల దాచుకున్న సొమ్ముల విషయంలోనైనా చెల్లింపులు ప్రారంభించాలని విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఎ ల మంజూరు, వేతన సవరణ ఏరియర్స్ చెల్లింపు తదితర అంశాలన్నీ అపరిష్కృతం గా ఉన్నాయని, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ లో నుంచి తీసుకున్న డిఎ బకాయిలను జూలైలో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు జమ చెయ్యలేదని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు సంబంధించిన న్యాయమైన కోర్కెలను పరిష్కారం చేయ్యలని ఆయన కోరారు. నూతనంగా ఎన్నిక కాబడిన సాంబశివరావు వంశీ కృష్ణ మోహన్ ల కార్యవర్గాన్ని అభినందిస్తూ గన్నవరం తాలూకా యూనిట్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ప్రత్యేక ప్రమాణాలను ఆ యూనిట్ నెలకొల్పిందని, దానికి తగ్గకుండా పనిచేస్తూ ఉద్యోగుల మన్నలలను ఉండవలసిన అవసరం నూతన కార్యవర్గానికి ఉందని ఆయన అన్నారు. గన్నవరం తాలూకా యూనిట్ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరచు వెళ్తూ, ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా నూతన కార్యవర్గం ఉండాలని విద్యాసాగర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యం డి ఇక్బాల్. గన్నవరం ఎన్జీవోస్ ఎన్నికల అధికారిగా యం రాజుబాబు సహాయ ఎన్నికల అధికారిగా పురుషోత్తమరాజు, ఎన్నికల పరిశీలికలుగా విశ్వనాధ్ వ్యవహరించారు. వీరితో జిల్లా ఉపాధ్యక్షుడు జి రామకృష్ణ, సతీష్ కుమార్, మధుసూదన్ రావు, విజయవాడ నగరశాఖ అధ్యక్షుడు జె స్వామి, కార్యదర్శి సంపత్ కుమార్, సీవీఆర్ ప్రసాద్, నూజివీడు తాలూకా యూనిట్ అధ్యక్షుడు శ్రీను, ఉయ్యురు తాలూకా యూనిట్ కోశాధికారి కృష్ణ మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *