Breaking News

రీ సర్వే, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి… : రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాల్లో రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారులకు భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం సాయంత్రం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ, గడప గడపకు మన ప్రభుత్వం తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో అమరావతి నుండి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా కృష్ణాజిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న భుహక్కు భూ రక్ష రీసర్వే లో గ్రౌండ్ వ్యాలిడేషన్, డి ఎల్ ఆర్ పబ్లిష్ చేయడం హక్కు పత్రాలు అందజేయడం వంటివి ఫిబ్రవరి మాసాంతానికి సకాలంలో పూర్తి చేయాల్సి వుంటుందని అన్నారు. జాతీయ రహదారులు, ఎపి ఐ ఐ సి కొరకు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. స్పందన అర్జీలపై సకాలంలో స్పందించి బియాండ్ ఎస్. ఎల్. ఎ కు వెళ్లకుండా అర్థవంతమైన పరిష్కారం అర్జీదారులకు చూపాలని, రెవెన్యూ అంశాలు మరింత జాగ్రత్తగా పరిశీలన,త్వరిత గతిన అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని ఈ అంశం సి.ఎం.ఓ.స్థాయిలో సమీక్షిస్తున్నారని అన్నారు.
వ్యవసాయశాఖ కు సంబంధించి రబీ వరి పంటకు ఈ క్రాపింగ్ పూర్తి చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కు పౌర సరఫరాల సంస్థ సన్నద్ధం కావాలని అన్నారు. సూపర్ చెక్ ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిందని తాహసిల్డార్లు, ఆర్డీవో లు, అగ్రికల్చర్ అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. పి ఎం కిసాన్ ఈ కెవైసి సకాలంలో పూర్తి చేయాలని, ఏదైనా తగ్గుదల ఉంటే సరి అయిన కారణాలు నివేదికలు ఉండాలని అన్నారు.మిల్లెట్స్ చిరు ధాన్యాలు పంటలను ప్రోత్సహించాలని సూచించారు. హార్టికల్చర్ కూడా లక్ష్యాల మేరకు శత శాతం అందిపుచ్చుకోవాలి అని అన్నారు. మత్స్య శాఖ పై సమీక్షిస్తూ మినీ ఫిష్ రీటైల్స్ ఔట్లెట్, డొమెస్టిక్ మార్కెటింగ్ యూనిట్లు, చేయూత గ్రౌండింగ్ పై డి ఆర్ డి ఎ, మెప్మా , లీడ్ బ్యాంక్ సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. జగనన్న పాల వెల్లువ పై సమీక్షిస్తూ ఎఎంసియు, బిఎంసియు నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఉగాది నాటికి నిర్దేశించిన విధంగా గృహ నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా వివిధ స్టేజిలో ఉన్నవాటిని పూర్తి చేసే దిశగా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణాలకు ఎస్. హెచ్. జి. ల ద్వారా అదనపు రుణం లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కేటగిరీ 3 లేఔట్ లలో తాగు నీటి కొళాయిలు ఏర్పాటు, విద్యుత్తు కనెక్షన్స్, అంతర్గత రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి శనివారం హౌసింగ్ డే గా జిల్లాలో అన్ని మండలాల్లో సంబంధిత అధికారులు లేఔట్ ల సందర్శన గృహ నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయ పరిధిలో అందిన 1589 పనులలో అత్యంత ప్రాధాన్యత పనులకు అనుమతులు ఇచ్చిన వాటిలో పనులు వివిధ దశలలో ఉన్నవాటిని వేగవంతం చేయాలని, ఎప్పటికప్పుడు బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ఇంకా ప్రారంభం కానీ వాటిని సత్వరమే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా సర్వే అధికారీ ఎస్. గోపాలరాజా , ముడా విసి నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సత్యనారాయణ రాజు, మత్స్యశాఖ అధికారి ఎన్. శ్రీనివాసరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సామాజిక భద్రతలో ఏపీ దేశానికే ఆదర్శం

-సంక్షేమం–అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి -క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి: దేవినేని ఉమా మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *